![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -67 లో.....గంగ రుద్ర కలిసి ఇంటికి వస్తారు. వాళ్లని చూసి ఎక్కడికి వెళ్లారని పెద్దసారు అడుగుతాడు. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నాం.. గంగ ని చంపాలని ప్రయత్నం చేసిన వాడి గురించి తెలిసిందని ఇన్‌స్పెక్టర్ కాల్ చేస్తే వెళ్ళామని రుద్ర చెప్తాడు.
ఆ తర్వాత గంగ ఊహల్లో తేలుతుంటే తనని పెద్దసారు చూస్తాడు. ఎవరు ఆ అబ్బాయి పెళ్లికి ముహూర్తం పెట్టించామంటావా అబ్బాయి పేరు ఏంటని అడుగుతాడు. రుద్ర అని గంగ చెప్పబోతు ఆగిపోతుంది. నేనే టెన్షన్ లో ఉన్నా తలనొప్పిగా ఉందని టాపిక్ డైవర్ట్ చేసి గంగ వెళ్ళిపోతుంది. నా దగ్గర నీ నాటకాలు బాగా నేర్చావ్ తెలుసుకుంటానని పెద్దసారు అంటాడు. గంగ బయటకి వెళ్లి క్రేజీ కష్మోరా నుండి రాజకుమారుడిని బయటకు తీసుకొని రావాలని అనుకుంటుంది. లోపల బుక్స్ చదువుకుంటున్న రుద్రకి ఫోన్ చేస్తుంది. రుద్ర దగ్గర గంగ ఫోన్ నెంబర్ లేకపోవడంతో రుద్ర లిఫ్ట్ చెయ్యడు.
రుద్ర దగ్గరికి గంగ వచ్చి మీకు ఫోన్ వస్తున్నట్లు ఉందని అంటుంది. సైలెంట్ లో ఉన్నా ఫోన్ వచ్చిందని నీకెలా తెలుసని రుద్ర అంటాడు. అంటే ఫోన్ లైట్ వచ్చింది అనిపించిందని గంగ అంటుంది. గంగ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్ర రిటర్న్ కాల్ చేసినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |